Sunday, September 20, 2026
No menu items!
Homedevotionalదోభిఘాట్ శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం అభివృద్ధికి కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ చేయూత‌

దోభిఘాట్ శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం అభివృద్ధికి కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ చేయూత‌

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :    దోభిఘాట్ శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం అభివృద్ధికి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ చేయూత‌నిచ్చారు. శుక్రవారం దోభిఘాట్ బ‌స్తీలోని శ్రీ ఈద‌మ్మ దేవాల‌యం ప‌నుల‌ను కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ ప‌రిశీలించారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ దోభిఘాట్‌లోని శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం పున‌ర్నిర్మాణంలో భాగంగా బ‌స్తీవాసుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఆల‌యానికి కావాల్సిన ఫ్లోరింగ్ కోసం గ్రానైట్ స్టోన్, టైల్స్‌ను, వాటి ఏర్పాటు చేసేందుకు లేబ‌ర్ వ్య‌వ‌స్థ‌ను కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అంద‌చేశారు. డివిజన్‌లో దేవాలయాల పునర్నిర్మాణాలు, అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందచేయడం, ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములం కావడం అదృష్టంగా భావిస్తున్నామని కార్పొరేటర్ పావ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బిజెపి ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, సత్తి రెడ్డి, శివ కుమార్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, బ‌స్తీవాసులు నగేష్, వెంకటేష్, మల్లికార్జున్, సాయికిరణ్, సురేష్, రమేష్, విష్ణు, లక్ష్మీ, పూజిత, సత్యనారాయణ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page