హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివి గిరినగర్ బస్తీ కమ్యూనిటీహాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హాజరై స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ పొందుతున్న మహిళలతో కార్పొరేటర్ పావని మాట్లాడారు. శిక్షణ తరగతుల పై టీచర్ల బోధన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని కార్పొరేటర్ పావని తెలిపారు. డివిజన్‌లో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ నేతలు సాయి కుమార్, ఆనంద్ రావు, సాయి, శిక్షణను అందిస్తున్న టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply