నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ పావని

నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ పావని

హైదరాబాద్, జ‌న‌వ‌రి 24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పాత మయూరి థియేటర్ లేన్ లో భాగ్యనగర్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ నుండి మెయిన్ రోడ్డు వరకు సుమారు రూ. 22లక్షల జిహెచ్ఎంసి నిధులతో కొనసాగుతున్న నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ ఎ.పావని, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌ మహేష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, స్థానిక అపార్ట్‌మెంట్‌ వాసులతో కలిసి పర్యవేక్షించారు. నూతన సిసి రోడ్డు నిర్మాణం నాణ్యత పరిమాణాలను పాటిస్తూ, వేగవంతంగా పనులు పూర్తి చేసి, మరో పది రోజుల్లో నూతన రోడ్డు ప్రజల అందుబాటులోకి తేవాలని అధికారులను కార్పొరేట‌ర్ పావ‌ని ఆదేశించారు. అనంతరం స్థానికంగా ఉన్న‌ సమస్యలను రోడ్డు నిర్మాణం పనులతో పాటు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామ‌ని స్థానిక అపార్ట్‌మెంట్‌ వాసులకు కార్పొరేటర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ ఎలైట్, భాగ్యనగర్ కాంప్లెక్స్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ వాసులు శ్రవణ్ కుమార్, శేషు, అశోక్, జ్యోతి, అంజన తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page