Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadబాబూ జాగ్జీవన్ రామ్ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

బాబూ జాగ్జీవన్ రామ్ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

📰 Generate e-Paper Clip

బాబూ జాగ్జీవన్ రామ్ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ద‌ళిత మోర్చ ఆధ్వ‌ర్యంలో ఆదివారం భార‌త మాజీ ఉప ప్ర‌ధాన మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… భారత రాజకీయ వ్యవస్థలో అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు.పేద వారి కోసం పాటుపడిన మహా నేత అని కార్పొరేటర్ పావ‌ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్‌ కుమార్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, విఎస్‌టి.రాజు, పి.నర్సింగ్ రావు, శివ కుమార్, శ్రీనివాస్, ప్రకాష్ యాదవ్, దళిత మోర్చ నాయకులు సత్యేంధర్, నర్సింహ, సాయి కుమార్, చర్ర యాదగిరి, రాజేందర్, సుక్క యాదగిరి, రహమత్ ఆలి, సంధ్యా రాణి, పూర్ణ, సంయుక్త రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page