Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabad10 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

10 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్టి కాలనీలో 10 ఏళ్లుగా ఉన్న సమస్యను స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పరిష్కరించారు. ఎస్ఆర్టి కాలనీలో నూతనంగా నిర్మించిన అమ్మ వారి కమాన్ ప్రక్కన ఉన్న సివిల్ సప్లయ్ కి సంబంధించిన ప్రభుత్వ ఖాళీ స్థలంలో గత 10 ఏళ్లు గా మట్టి, చెత్త చెదారంతో నిండిపోయి దుర్వాసన, దోమలు వృద్ధి చెంది స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఎస్ఆర్టి వాసులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు చేసిన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ పావని ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యేక దృష్టి వహించి ఖాలీ స్థలంలో పేరుకుపోయిన చెత్త, చెదారం, మట్టినీ జిహెచ్ఎంసి, రాంకి సిబ్బంది ద్వారా చెత్తను తొలగింపచేసారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… ప్రజలకు హాని కలిగించే విధంగా మారిన ఖాలీ స్థలంలోని చెత్త చెదారం తొలగించి, నిరుపయోగంగా ఉన్న ఖాలీ స్థలంలో ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగకరంగా ఉండేందుకు మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. నిరుపయోగంగా, చెత్త చెదారంతో నిండిన స్థలాన్ని అభివృద్ధి పరిచేందుకు, పదేండ్ల సమస్యను పరిష్కరించినందుకు కార్పొరేటర్ పావనిని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, జి.శ్రీనివాస్, సురేష్, హన్మంతు, ఆనంద్ రావు, యాదగిరి, సాయి సంతోష్, సత్యేంధర్, జిహెచ్ఎంసి సిబ్బంది, ఎస్ఆర్టి కాలనీవాసులు శ్రీనివాస్ యాదవ్, లడ్డు, శివ, పున్న సత్యనారాయణ, గుర్రం గణేష్ ఎం.డి.గౌస్, సమార్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page