18 నెల‌లకాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌న‌లో అవినీతే రాజ్య‌మేలుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

18 నెల‌లకాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌న‌లో అవినీతే రాజ్య‌మేలుతుంది

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా


హైదరాబాద్, ఆగ‌స్టు 04, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా… అధికారంలోకి వచ్చింది మెదలు అవినీతి అంటూ ఒకటే రాగం అందుకుని పాడిందే పాడరా పాసు పళ్ళ దాసరి అన్న చందంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఎగిరి ఎగిరి చివరకు ఆ కేసును నీరు గార్చి కనుమరుగు చేసారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ జిల్లా టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… డ్రగ్స్ కేసు – గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో 9 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అవడంజ… ఆ కేసులో ఇప్పటికి సాధించింది ఏమీలేదన్నారు. అదే విధంగా కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నాణ్యతా లోపాలు, డిజైన్ లోపాలు అవినీతి అంటూ ఊదర గొట్టి ఆ కేసు ముందుకు సాగడంలేదన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు సాధించింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. జస్టీస్ ఘోష్ కమీషన్ వేసి కమీషన్ నివేదిక ఇచ్చింద‌ని… దాన్ని కూడా భూస్థాపితం చేస్తారా, లేక ముడుపులు పుచ్చుకుని మూసివేస్తారా అని ప్రశ్నించారు. జస్టీస్ ఘోష్ కమీషన్ నివేదికలో వాస్తవాలన్ని ప్రజల ముందుంచి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి దోపిడికి పాల్పడ్డ అధికారులను, నాయకులను, కాంట్రాక్టర్లను శిక్షించాలని, ఈ దశాబ్దంలో అతిపెద్ద కుంభకోణమైన కాళేశ్వరం అవినితిని కనుమరుగు చేసే పన్నాగాలు చెల్లవని అన్నారు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని సాయిబాబా హెచ్చరించారు. కాబట్టి వెంటనే పారదర్శకంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడ్డ దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, ఎబిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page