Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadసమగ్ర ప్రణాళికలతో న‌గ‌రంలో మౌలిక సదుపాయాల కల్పన – మంత్రి పొన్నం ప్రభాకర్

సమగ్ర ప్రణాళికలతో న‌గ‌రంలో మౌలిక సదుపాయాల కల్పన – మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

సమగ్ర ప్రణాళికలతో న‌గ‌రంలో మౌలిక సదుపాయాల కల్పన
– మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 2, అద్దం న్యూస్ :   హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ నిధులు రూ.6 కోట్లతో హుస్సేన్ సాగర్ స‌ర్‌ప్ల‌స్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి–దోమలగూడ లింక్ బ్రిడ్జ్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కమిషనర్ ఆర్ వి కర్ణన్ ల‌తో క‌లిసి జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ ను అనుకుని ఉన్న పురపాలికల విలీనంతో విస్తీర్ణం, జనాభా పరంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించిందని అన్నారు. అతి పెద్ద నగరంలో జనాభాకు తగ్గట్టు రోడ్లు, డ్రైన్ లు, వీధి దీపాలు, పార్క్ లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కి సీఎం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. జిల్లా ఇంచార్జీ మంత్రిగా స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్ర స్టేట్ హెడ్ క్వార్టర్‌గా, క్యూర్ లోపలి ప్రాంతంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్లు జి.ర‌చ‌న శ్రీ, పావ‌ని విన‌య్ కుమార్‌, ఎస్ఈ మోహన్ రెడ్డి, ఈఈ రోహిణి, డిఈఈ రేణుక, ఏఈఈ ప్రశాంత్ ల‌తో పాటు బిజెపి నాయ‌కులు విన‌య్ కుమార్‌, జి.వెంక‌టేష్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు జానకి సుధాక‌ర్‌, జ‌యేంద‌ర్ బాబు, యాద‌గిరిగౌడ్‌, మారిశెట్టి న‌ర్సింగ్‌రావు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page