డీఎస్సిలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజి బీఈడీ అభ్యర్థులకు శాపం
వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి
– బీఈడి అభ్యర్థుల నాయకురాలు అయిలి కవిత డిమాండ్
హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ : డీఎస్సిలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజి బీఈడీ అభ్యర్థులకు శాపంగా మారిందని, వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని బీఈడి అభ్యర్థుల నాయకురాలు అయిలి కవిత గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాద్యాయ నియామకాల్లో కేజీబీవీ ఉద్యోగులకు వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని బీఈడీ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని.. ఈ ప్రతిపాదన ఎన్‌సిటిఈ రూల్స్ కి విరుద్ధం అని అవసరమైతే వారికి వేతనాలు ఇతర మార్గాల ద్వారా లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేయిటేజీ ప్రతిపాదన వల్ల ఉన్న పోస్టుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఈడి అభ్యర్థుల నాయకురాలు అయిలి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో విద్యాశాఖ ప్రతిపాదించిన అంశాన్ని ప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిఎడ్, బిఎడ్ నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన లేపుతుందని, ఒక విభాగంలోని ఉద్యోగులకు ఇలా వెయిటేజి ఇస్తే రాబోయే కాలంలో ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఈ విధంగానే అడిగే అవకాశం ఉందన్నారు. గతంలో పనిచేసిన విద్యా వాలంటరీలు ప్రీ ప్రైమరీ టీచర్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్‌సిలో ఎలాంటి వెయిటేజి ఎవరికి ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని వెంటనే విరమింపచేసుకోవాలని, లేదంటే ఉద్యమానికి సిద్ధం అవుతారని నిరుద్యోగులు, విద్యావేత్తలు, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని కవిత పేర్కొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply