భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేస్తుండ‌గా హైటెన్స‌న్ వైర్లు త‌గిలి కూలి మృతి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   భ‌వ‌న నిర్మాణం ప‌నులు చేస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ 11 కెవి విద్యుత్ తీగ‌ల‌కు త‌గిలి కూలి మృతి చెందిన సంఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఎస్ఐ.నాగ‌రాజు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విజ‌య‌న‌గ‌రానికి చెందిన నాయుడు ( 54 ), అత‌ని భార్య లక్ష్మీ పిల్ల‌ల‌తో క‌లిసి హైద‌రాబాద్ ముషీరాబాద్ బాకారంలో నివ‌సిస్తున్నారు.భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లో రోజువారిగా కూలిగా నాయుడు ప‌ని చేస్తుంటాడు. రాంన‌గ‌ర్ డివిజ‌న్ రిసాల‌ఖుర్షీద్ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ఇలాం హుస్సేన్ గ‌త కొన్ని రోజులుగా భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా నాయుడు ఇలాం హుస్సేన్ భ‌వ‌న నిర్మాణ ప‌నిలో కూలిగా చేరాడు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం కూడా ప‌నికి వ‌చ్చిన నాయుడు నిర్మాణ భ‌వ‌నం రెండ‌వ అంత‌స్తుపై ఇనుప రాడ్‌తో ప‌ని చేస్తున్నాడు. ఆ భ‌వ‌నం ప‌క్క‌న్నే ఉన్న 11 కెవి విద్యుత్ తీగ‌ల‌కు ఆ ఇనుప రాడ్ త‌లిగడంతో విద్యుత్ షాక్‌కు గ‌రై నాయ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృతుడి కుటుంబ‌స‌భ్యుల‌కు సమాచారం అంద‌చేశారు. ఈ మేర‌కు మృతుడి భార్య ల‌క్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు ఇంటి ఓన‌రు ఇలాం హుస్సేన్ పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page