డక్కలి కుల సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు
బాణాల సాలమ్మకు దళితరత్న అవార్డు
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డక్కలి కుల సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బాణాల సాలమ్మకు దళిత రత్న అవార్డు దక్కింది. బాబూ జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఇటుక రాజు, ఉపకులాల రాష్ట్ర ఛైర్మన్ మేడి పాపయ్య, బేడ బుడగ జంగం సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పాటి హనుమంతరావుల చేతుల మీదుగా సాలమ్మకు దళితరత్న అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా వారు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాలమ్మ మాట్లాడుతూ… తనకు దళితరత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. 
డక్కలి కుల సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బాణాల సాలమ్మకు దళితరత్న అవార్డు
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply