గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి
– డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : గర్భిణీ స్త్రీలు, చిన్నారుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా తార్నాక డివిజన్ సత్యనగర్ అంగన్‌వాడి సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. అలాగే, పోషణ విలువల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… మంచి ఆరోగ్యానికి దోహదపడే విధంగా మన రోజు వారీ ఆహారంలో అన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా అందుబాటులో చౌకగా లభించే పోషక విలువలతో నిండిన ఆకుకూరలు, పండ్లు, మిల్లెట్స్, గుడ్లు, పాలు వంటి ఆహార పదార్థాలను రోజువారీగా తీసుకోవాలని సూచించారు. అనంతరం టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి మాట్లాడుతూ… ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పోషకాహారంతో కూడిన ఆహారం కీలకమని, ప్రతిఒక్కరూ పోషణ ఆహారంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంగన్‌వాడి కార్యకర్తలు, సామాజిక సేవకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. 
డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply