...

పిల్ల‌ల‌ను మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాలి – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

 

పిల్ల‌ల‌ను మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాలి 

గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ :    పిల్ల‌ల‌కు సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను అల‌వాటు చేయాల‌ని, మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాల‌న్నారు.ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్‌లోని గీతాంజ‌లి హై స్కూల్లో ప్రీ ప్రైమ‌రి గ్రాడ్యుయేష‌న్ డే కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్‌, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు శాంత హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా కార్పొరేట‌ర్ పావ‌ని విద్యార్థుల‌కు ప‌ట్టాలందించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… పాఠ‌శాల త్రివేణి సంగ‌మంలాంటింద‌న్నారు. టీచ‌ర్లు స‌ర‌స్వ‌తి దేవి అని, త‌ల్లిదండ్రులు గంగ‌తో, విద్యార్థులు య‌మున‌తో స‌మాన‌మ‌న్నారు. విద్యార్థులు త‌మ త‌మ పుట్టిన రోజున ఒక మొక్క‌ను నాటాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు న‌వీన్‌కుమార్‌, శ్రీకాంత్, స‌త్తిరెడ్డి, అభిషేక్‌, నీర‌జ్, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

గీతాంజ‌లి స్కూల్ గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల్లో పాల్గొన్న గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్‌

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.