Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadదండెంపల్లి భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ పరిశ్రమను పునరుద్ధరించాలి – నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్...

దండెంపల్లి భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ పరిశ్రమను పునరుద్ధరించాలి – నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్

📰 Generate e-Paper Clip

దండెంపల్లి భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ పరిశ్రమను పునరుద్ధరించాలి

– నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్

హైదరాబాద్, జులై 23, అద్దం న్యూస్ :   దండెంపల్లిలోని భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ ( చగ్గులు, బూట్లు ) పరిశ్రమను పునరుద్ధరించాలని నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ అన్నారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ… 2003లో అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వం లెద‌ర్ ప‌రిశ్ర‌మ కోసం న‌ల్గొండ‌, దండెంప‌ల్లి లాంటి తొమ్మిది జిల్లాల్లో భూముల‌ను కేటాయించార‌న్నారు. అందులో దండెంపల్లిలోనే 24 ఎక‌రాల భూమి ఉంద‌న్నారు. ఆ భూముల్లో నిర్మించే లెద‌ర్ ప‌రిశ్ర‌మ‌లో మాదిగ (దళిత) యువత, యువకులు చెప్పుల తయారీ, బూట్లు కట్టించడం వంటి పనులకు శిక్షణ పొందడానికి ఈ భూములు ఉపయోగించాలని యత్నించింద‌న్నారు. అయితే గడిచిన కాలంలో నిర్లక్ష్యం వల్ల పరిశ్రమ వెన‌క్కు తిరిగిపోయినట్లుగా, భూములు కూడా ఇతరులకు అప్ప‌చెప్ప‌డం జ‌రిగింద‌ని సమితి ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ఇందులో ఈఎస్‌సి, ఎస్టీ సబ్–ప్లాన్ కింద రూ.300 కోట్ల నిధుల‌ను కేటాయించార‌న్నారు. ప్రత్యేకంగా కేటాయించిన ఫండ్‌, భూములు లెక్కలు తప్పి, పరిశ్రమ ఏర్పాటు ఆగిపోవ‌డంతో భూములను తిరిగి తీసుకొని, మాదిగ కులానికి అప్ప‌జెప్పి వారి జీవ‌నాధారంగా లెదర్ (చగ్గులు, బూట్లు) పరిశ్రమను పునరుద్ధరించాలని ర‌మేష్ కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page