Saturday, September 19, 2026
No menu items!
HomeNationalDavid Warner: కోహ్లీ రికార్డును సమం చేసిన ఆసీస్ స్టార్!

David Warner: కోహ్లీ రికార్డును సమం చేసిన ఆసీస్ స్టార్!

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) బిగ్ బాష్ లీగ్ (BBL)లో బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ తరఫున ఆడిన వార్నర్.. కేవలం 65 బంతుల్లోనే 130 పరుగులతో అజేయంగా నిలిచి సంచలనం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.

ఈ సెంచరీతో టీ20 ఫార్మాట్‌లో డేవిడ్ వార్నర్ (David Warner) శతకాల సంఖ్య 9కి చేరింది. దీంతో అత్యధిక టీ20 సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును వార్నర్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, బాబర్ ఆజం 11 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వార్నర్, కోహ్లీలు మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.

అయితే ఈ మ్యాచులో వార్నర్ (David Warner) మెరుపులతో 205 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. సిడ్నీ థండర్ జట్టు విజయం సాధించలేకపోయింది. హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ రాణించడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page