Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టి డిసిఎం వాహ‌నం –  మ‌హిళ మృతి 

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టి డిసిఎం వాహ‌నం –  మ‌హిళ మృతి 

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ :    డిసిఎం వాహ‌నం డ్రైవ‌ర్ నిర్లక్ష్యానికి ఓ మ‌హిళ మృతి చెందిన సంఘ‌ట‌న దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన అంబీర్ మ‌ధుసూద‌న్‌రావు, అంబీర్ శార‌ద ( 50 ) లు ఇద్ద‌రు ఈ నెల 27వ తేదీన రాత్రి 12:30 గంట‌ల స‌మ‌యంలో జెబిఎస్ నుంచి మోహిదీప‌ట్నంలోని త‌న కుమారుడి ఇంటికి ద్విచ‌క్ర వాహ‌నం పై వెళ్తుంది. ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న క్ర‌మంలో తిక్క‌న్న సోమాయాజి విగ్ర‌హం వ‌ద్ద శార‌ద ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని వేగంగా వ‌చ్చిన డిసిఎం వాహ‌నం ఢీకొట్టింది. దీంతో శార‌ద‌, ఆమె భ‌ర్త మ‌ధుసూద‌న్ రావు ఇద్ద‌రు కింద‌ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో శార‌త మృతి చెందింది. ఈ మేర‌కు డిసిఎం వాహ‌నం డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగానే శారద మృతి చెందింద‌ని దోమ‌ల‌గూడ పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. డిసిఎం డ్రైవ‌ర్ షేక్ అష్ర‌ఫ్‌ను అదుపులోకి తీసుకుని, వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు కేసును న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page