Friday, September 18, 2026
HomeHyderabadజియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలి – రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్,...

జియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలి – రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్, ఆరె క‌టిక అభివృద్ది సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా

జియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలి
– రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్, ఆరె క‌టిక అభివృద్ది సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :     జియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ల్లో బిసిల జ‌నాభా అత్య‌ధికంగా ఉన్నార‌ని, ఈ మూడు డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలని రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్, ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. జిహెచ్ఎంసి పరిధిలో ఆరె కటికలకు, బీసీలకు న్యాయం చేయాల‌ని, డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ బుధ‌వారం జిహెచ్ఎంసి కమిషనర్ క‌ర్ణ‌న్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా అశోక్ దాదా మాట్లాడుతూ… హైద‌రాబాద్ న‌గ‌రంలోని జియాగూడ, కాచిగూడ, గోషామహల్ ప్రాంతాల్లో అత్యధికంగా ఆరెకటిక, బిసి జనాభా ఉన్నార‌న్నారు. జియాగూడ ప్రాంతంలో ఆరెకటికల జనాభా 20 వేలకు పైమాటే అని, ఈ ప్రాంతంలో జనాభా దామాషా ప్రకారంగా ఈ డివిజన్‌ను బీసీలకు కేటాయించాలన్నారు. అలాగే కాచిగూడ, గోషామహల్ ప్రాంతాల్లో ఆరె కటికల, బీసీల జనాభా అత్యధికంగా ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్ల‌ల్లో జనాభా ప్రాతిపదికన సమగ్ర విచారణ జరిపించి.. అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో బీసీలకు కార్పొరేటర్ స్థానాలు కేటాయించి ఆరె కటికలకు, బీసీలకు న్యాయం చేయాల‌ని కోరారు. కమిష‌న‌ర్‌ను క‌లిసిన వారిలో రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర కోశాధికారి కేడి దినేష్ దాదా, జమాల్‌పూర్ నందు దాదా, రాజేష్ దాదా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page