రాంనగర్ చౌరస్తాలో దీక్షా దివస్
హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ 2009 నవంబర్ 29వ తేదీన ప్రాణాలకు తెగించి దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ కార్యక్రమం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో జరిగింది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వ గోపి, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, రమేష్, సత్యనారాయణ, వెంకట్ రావు, అరుణ్, వెంకటేష్, రాజేష్, అమిత్, శ్రీహరి, రమేష్ రెడ్డి, పాలమూర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply