Tuesday, September 22, 2026
No menu items!
HomeCrime Newsఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం – ఇద్ద‌రు చిన్నారుల మృతి

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం – ఇద్ద‌రు చిన్నారుల మృతి

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం
–ఇద్ద‌రు చిన్నారుల మృతి
– ఆందోళ‌న‌క‌రంగా 24 మంది చిన్నారుల ప‌రిస్థితి
– ముగ్గురు చిన్నారుల ప‌రిస్థితి విష‌మం
– చికిత్స పొందుతున్న చిన్నారుల‌కు  మెరుగైన‌  వైద్యాన్ని అందించండి
– అధికారుల‌ను ఆదేశించిన సీఎం

ఆదిలాబాద్, ( అద్దం న్యూస్ ) :   ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు మృతి చెంద‌గా, అందులో 5 రోజుల శిశువు ఉంది. మ‌రో 24 మంది చిన్నారుల ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌గా, ముగ్గురు చిన్నారుల ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మా కడుపుకోత తీర్చేది ఎవరు :
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటనలో త‌న 5 రోజుల బిడ్డ చ‌నిపోయింద‌ని ఓ తండ్రి అదిలాబాద్ కలెక్టర్ తో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నా బిడ్డ చనిపోయింది, మిగతా పిల్లలు చాలా బాధలో ఉన్నారని.. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడన్నారు.

చికిత్స పొందుతున్న చిన్నారుల‌కు వైద్యాన్ని అందించండి
– అధికారుల‌ను ఆదేశించిన సీఎం
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page