Tuesday, September 22, 2026
No menu items!
HomeEducationహై లెవల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి – తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసి రాష్ట్ర ఛైర్మన్...

హై లెవల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి – తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసి రాష్ట్ర ఛైర్మన్ మేకల అక్షయ్ కుమార్ డిమాండ్

📰 Generate e-Paper Clip

వరంగల్, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) :    జీవో 97 కి సవరణ జీవో వెంటనే విడుదల చేయాల‌ని, హై లెవల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాల‌ని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసి రాష్ట్ర ఛైర్మన్ మేకల అక్షయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మేకల అక్షయ్ కుమార్ సందర్శించి వారి ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఎస్బిటీఈటీ బోర్డు పరిధి నుండి పాలిటెక్నిక్ వ్యవస్థను తొలగించి శక్తి ( కార్మిక ) శాఖ పరిధిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఆధీనంలోకి చేరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన రోజు నుండి నేటి వరకూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఉద్యమంలో ఏనాడూ వెనక్కి తగ్గకుండా తమ భవిష్యత్ ను పణంగా పెట్టి అలుపెరుగకుండా పోరాడుతున్నారని అన్నారు.

ఈ నెల 19 వ తేదీన పాలిటెక్నిక్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉద్యోగుల జెఎసి ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా హై లెవల్ కమిటీ సభ్యులు పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను శక్తి ( లేబర్ ) శాఖ నుండి తొలగించి సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించేలా చూస్తామని ఎలాంటి స్పష్టమైన లిఖితపూర్వక హామీని ఇవ్వలేదని తెలిపారు. మరలా నిన్న 20 వ తేదీన ప్రభుత్వ హై లెవల్ కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు పాలిటెక్నిక్ ఉద్యోగుల జెఎసి ఛైర్మన్ కు ఫోన్ చేసి జీవో 97 నుండి పాలిటెక్నిక్ వ్యవస్థను మినహాగిస్తున్నట్లుగా నోటిమాట ద్వారా హామీ ఇచ్చారని తెలుపుతూ గత 35 రోజులుగా ఉధృతంగా జరిగిన పాలిటెక్నిక్ పరిరక్షణ ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు సంబంధిత జెఎసి నాయకులు పేర్కొన్న వార్తలు వివిధ సామాజిక మాధ్యమాల్లో, దినపత్రికల్లో వచ్చాయని అన్నారు‌.

ఒకవేళ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని, హై లెవల్ కమిటీ ప్రభుత్వానికి అందించిన రిపోర్టును బహిర్గత పరచాలని, జీవో 97 ప్రకారం శక్తి (లేబర్) శాఖలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ పరిధిలోకి చేర్చుతున్నట్లు పేర్కొన్న పాలిటెక్నిక్ వ్యవస్థ సంబంధిత ఆంశాలను సవరించినట్లు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగిస్తున్నట్లు నూతన సవరణ జీవో ని ప్రభుత్వం వెంటనే విడుదల చేసి పబ్లిక్ డొమైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థి నాయకులు భానుప్రకాశ్, త్రిశ్, శివ, పవిత్ర, శృతి తదితరులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page