నియోజ‌క‌వ‌ర్గంలో కోట్ల రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తున్నాం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గంలో కోట్ల రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తున్నాం

– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లాది రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తున్నామ‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ సాగ‌ర్‌లాల్ హాస్పిట‌ల్ నుంచి ద‌యారా మార్కెట్ చౌర‌స్తా వ‌ర‌కు కోటి రూపాయ‌ల నిధుల‌తో నూత‌నంగా సిసి రోడ్డు వేయించినందుకుగాను రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షులు శంక‌ర్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో బ‌స్తీవాసులు శ‌నివారం బాకారం బొమ్మ‌ల‌గుడి వ‌ద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు, బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ ల‌కు స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా శాలువాలు క‌ప్పి, పూల‌మాల‌ల‌తో ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… బస్తీలో ఏ సమస్యలు ఉన్నా నేను ఉన్నానని బస్తీ వాసులకు భరోసా ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌ల్లో పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించుకుంటూ వ‌స్తున్నామ‌న్నారు. ఏ స‌మ‌స్య‌లున్నా త‌న దృష్టికి తీసుకువ‌స్తే సంబంధిత అధికారుల‌తో మాట్లాడి ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి దామోదర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముదిగొండ మురళి, గోక నవీన్, జావీద్ ఖాన్‌, బస్తీ వాసులు రెహాన్ ఖాన్, శ్రావణ్, ప్రవీణ్, ఎస్.వెంకటేశ్వర్, రమేష్, జబ్బర్ బాయ్, ప్రేమ్, సైదులు, రామ్ రెడ్డి, సునీల్, వెంకటేష్, దీన్ దయాల్ రెడ్డి, జి.శ్రీనివాస్‌, శేఖర్, మల్లేష్ యాదవ్, జ్ఞానేశ్వర్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page