Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadధర్మచరణ సమితి సంఘం ఎన్నిక ఏకగ్రీవం – అధ్యక్షుడిగా పాశం అనిల్ కుమార్...

ధర్మచరణ సమితి సంఘం ఎన్నిక ఏకగ్రీవం – అధ్యక్షుడిగా పాశం అనిల్ కుమార్ యాదవ్  ఎన్నిక

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్‌ 24 అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బాకారం ధర్మచరణ సమితి సంఘం ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించగా, సభ్యుల సంపూర్ణ ఏకాభిప్రాయంతో కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పాశం అనిల్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా బి.మహేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా ఎటి.సతానారాయణ చారి, ఉపాధ్యక్షుడిగా ఎస్.నారాయణ మూర్తి ఎన్నిక కాగా, కార్యవర్గ సభ్యులుగా ఎం.సుధీర్ కుమార్, ఎ.సాయి యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాశం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ధర్మచరణ సమితి సంఘం అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. సాంప్రదాయ ఆచారాల పరిరక్షణ, సభ్యుల సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా వ్యవహరిస్తామన్నారు. అదే లక్ష్యంతో కొత్త కమిటీ ఏర్పడిందని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయడమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిటీ చైర్మన్ ఎ.నర్సింహ పర్యవేక్షించగా, కమిటీ సభ్యుడు ఎ.సుదేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page