Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ బాల‌ల హ‌క్కుల దినోత్స‌వం

అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ బాల‌ల హ‌క్కుల దినోత్స‌వం

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్‌, నవంబర్ 23, అద్దం న్యూస్ :     అప్స స్వ‌చ్చంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ బాల‌ల హ‌క్కుల దినోత్స‌వం జ‌రిగింది. ఆదివారం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ డివిజ‌న్ అప్స స్వ‌చ్ఛంద‌ సంస్థ ఆధ్వర్యంలో సర్వ్ నీడీ సహకారంతో యూత్ హాస్టల్ లో ప్రపంచ బాలల హక్కుల దినాన్ని పుర‌స్క‌రించుకుని 30 బ‌స్తీల్లోని బాల బాలికలతో. పిల్లలతో ఆటలు, పాటలు నృత్య‌ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాప‌కుడు వేద‌కుమార్ హాజ‌రై మాట్లాడుతూ… అప్స లాంటి స్వ‌చ్ఛంద సంస్థ‌లు వివిధ బ‌స్తీలోని బాల, బాలికలను ఒకే వేదికపై తీసుకువచ్చి హక్కులపై అవగాహ‌న‌ చేయడమే కాకుండా ఆటపాటలతో కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికీ బహుమతులను అంద‌చేయ‌డం మంచి కార్య‌క్ర‌మం అని అన్నారు. సర్వ్ నీడీ స్వ‌చ్ఛంద‌ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు చిన్న తనం నుండి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలన్నారు. సర్వ్ నీడీ సంస్థ అన్నదాత ప్రాజెక్ట్ ద్వారా ప్రతి రోజు సుమారు 2 వేల ఆనాధలు, నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తామన్నారు.

         నిరాశ్రుయులైన, వృద్దులకు రగ్గులు, స్కాటర్ పంచుతున్నామ‌న్నారు. తల్లి దండ్రులు లేని చిన్నారులకు ఆశ్రమం ఇవ్వడమేకకుండా వారికి విద్యా, వైద్యం అందిస్తున్నామ‌న్నారు. అనాధ శవాలకు ఉచిత అంత్య‌క్రియ‌లను కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ సీనియ‌ర్ కో– ఆర్డినేట‌ర్లు బొట్టు ర‌మేష్‌, బ‌స‌వ‌రాజు లు మాట్లాడుతూ… ప్రతి విద్యార్ధి తమ హక్కులను తెలుసుకొని హక్కుల సాధనకు కృషి చేయాల‌న్నారు. ముందు తరాలకు ఆదర్శనంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్స సామాజిక కార్యకర్తలు గాజుల మంజుల, రాజేశ్వరీ, శోభా, శ్రావణి, మల్లికా, ఇందిరా, లావణ్య, ప‌లు బ‌స్తీల‌కు చెందిన పిల్ల‌లు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page