బోనాల చెక్కుల పంపిణీ రసాభాస
రెండు గంటలు వేచిన తర్వాత అసహనంతో వెళ్లిపోయిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
మీరు వయస్సులో పెద్ద వాళ్లు… మమ్మల్ని ముందుండి నడిపించాలి
– రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్
హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బోనాల ఉత్సవాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. చెక్కుల పంపిణీకా ఇదిగో వస్తున్నా అని చెప్పి 2 గంటల అయినా ఎంపి అనిల్ కుమార్ యాదవ్ రాకపోవడంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తరపున బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవాదాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ప్రజాస్వామికబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేను కాదని నామినేటెడ్ పదవిలో ఉన్న ఎంపి అనిల్ కుమార్ యాదవ్ కోసం ఎదురు చూడడం ఏంటని, ఆయన వచ్చే వరకు చెక్కుల పంపిణీ చేయమని అనడం ఏంటని అధికారులను బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవాదాయ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అసహనంతో వేదిక నుంచి వెళ్లిపోయారు.
రెండు గంటలు వేచిన తర్వాత అసహనంతో వెళ్లిపోయిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

యోజకవర్గానికి సంబంధించిన 201 దేవాలయాలకు సంబంధించి కోటి 7 లక్షల 60 వేల 500 మంజూరయ్యాయి. ఈ చెక్కులను భోలక్‌పూర్ దేవునితోట శ్రీ భవాని శంకర దేవాలయంలో పంపిణీకి గురువారం ఓ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌కు, కార్పొరేటర్లకు సంబంధిత అధికారులు సూచించారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే ముఠౄ గోపాల్, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, ముషీరాబాద్ తహశిల్థార్ రాణా ప్రతాప్‌సింగ్ లు హాజరయ్యారు. ఎంపి అనిల్ కుమార్ యాదవ్‌కు అధికారులు ఫోన్ చేయగా ఇదిగో వస్తున్నా అని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ రెండు గంటలైన రాకపోవడంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను కొన్ని చెక్కులను ఇచ్చి వెళ్తానని ఎమ్మెల్యే అనగా,, ఆ చెక్కులను అధికారులు తమ వద్ద పెట్టుకొని ఓ పక్కకు వెళ్తగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు అలా ఎలా చెక్కులను దాచిపెట్టుకుంటారని మండిపడ్డారు. తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో చెక్కులను ఇవ్వకుండానే కార్యక్రమాన్ని బహిష్కరించి నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.
మీరు వయస్సులో పెద్ద వాళ్లు… మమ్మల్ని ముందుండి నడిపించాలి
– రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్
కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల ఆలస్యమైందని, మనం వెళ్లే కార్యక్రమాలకు అప్పుడప్పుడు ఆలస్యం కావడం సర్వసాధారణమని, మీరు వయస్సులో పెద్ద వాళ్లు… మమ్మల్ని ముందుండి నడిపించాలని రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన తర్వాత కొద్ది సేపటికి ఎంపి అనిల్ వచ్చారు. కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, చెక్కుల ఇన్‌చార్జ్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ సిబ్బంది సురేష్ తదితరులతో కలిసి ఆలయాల బోనాల చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెక్కుల పంపిణీ కార్యక్రమం 10 గంటలకు రావాలని మొదట చెప్పారని, నేను పది గంటలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ అప్పటికి ఆలయాల నిర్వాహకులు ఎవరూ రాలేదని అధికారులు చెప్పడంతో తాను వేరే కార్యక్రమానికి వెళ్లిపోయానన్నారు. అక్కడ కొద్దిగా ఆలస్యమైందని, చాలా కార్యక్రమాలకు ఆలస్యంగా వెళ్లడం సర్వ సాధారణమని, ఆ విషయం పెద్దలు ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు తెలుసునన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని, అది ఆధ్యాత్మికమైన కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగపాక వెంకట్, పలు డివిజన్ల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ వాజిద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, పలు డివిజన్ల అధ్యక్షులు కొండా శ్రీధర్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్, రాకేష్, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, బిజెపి నాయకులు జి.వెంకటేష్, పరిమల్‌కుమార్, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply