Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadనిరుద్యోగ యువతకు పోటీ ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన పుస్తకాల పంపిణీ

నిరుద్యోగ యువతకు పోటీ ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన పుస్తకాల పంపిణీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, న‌వంబ‌ర్ 16, అద్దం న్యూస్ : ఇరుకు ఇళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నా.. నిరుద్యోగులకు ఆదివారం హైద‌రాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టడీ రూమ్ ను ఏర్పాటు చేశారు. పోటి పరిక్షలకు కావాల్సిన విలువైన స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగ యువతకు పోటీ ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన పుస్తకాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా విన‌య్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ యువత గురించి బిగ్గరగా గొంతెత్తి చెప్పడమే…. ఎవ్వరైనా ఎక్కడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని ఇదే అని అన్నారు. ఓపిక ఉన్నంతవరకు కాదు, ఊపిరి ఉన్నంతవరకు పోరాడడమే పరిష్కారమన్నారు. నిరుద్యోగులకు ఒక భరోసా కావాలి… మంచి జ్ఞానం కావాలి.. జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కావాలన్నారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు రాబట్టాలని మంచి ఉద్యోగాలు పొందాలని ఈ సందర్భంగా పోటీ పరీక్షల విద్యార్థులకు వివరించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… వేడుకల పేరిట డబ్బు వృధా చేయకుండా గుడుల కోసం డబ్బులు వెచ్చించకుండా జ్ఞానం కోసం సహాయం చేసే దాతల సహాయంతో నిరుద్యోగులకు భావి భారత పౌరులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహాయ సహకారాలు అందింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్టడీ రూమ్ ఇంచార్జీ కవిత, ప్రసాద్, పోటీ పరీక్షల విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page