రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల పంపిణీ

బిఆర్‌ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు
రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల పంపిణీ

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :   వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బిఆర్‌ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల పంపిణీ కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగింది. రాంనగర్ చౌరస్తాలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్, జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌రై వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పేద ప్ర‌జ‌ల‌కు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ రెడ్డి, రేషం మ‌ల్లేష్ లు మాట్లాడుతూ… ప్ర‌తి ఒక్క‌రూ మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌నే ప్ర‌తిష్టించాల‌ని కోరారు. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్ర‌హాల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హానిక‌ర‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ నాయకులు సిరిగిరి శ్యామ్, రాకం సత్యనారాయణ, శివ కుమార్ యాదవ్, వెంకటేష్, విక్కీ నేత, సంపత్, తిరుమల, రేణుక, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page