Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadమ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ల పంపిణీ

మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ల పంపిణీ

హైదరాబాద్, జ‌న‌వ‌రి 31, అద్దం న్యూస్ :    ల‌యన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సర్వీస్ ఆక్టివిటీ కార్యక్రమంలో భాగంగా హైద‌రాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, కవాడిగూడ‌ కార్పొరేటర్ రచన శ్రీ హాజ‌ర‌య్యారు. గాంధీనగర్‌, కవాడిగూడ‌ డివిజన్లల్లో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి కల్పించే విధంగా 82 కిట్టు మిషన్లను కె.లక్ష్మణ్ చేతులమీదుగా మహిళలకు అందచేసారు. ఈ సంద‌ర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారని, అందుకు అనుగుణంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ఉచితంగా కుట్టు, ఎంబ్రాయిడరీ, బ్యూటీషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

          మహిళలు స్వతహాగా ఆర్థిక అభివృద్ధి చెందేందుకు సహాయకరంగా ఉపాధి కొరకు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా 82 కుట్టు మిషన్లను లబ్దిదారులకు అందజేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంపా నాగేశ్వర్ రావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు అశోక్‌కుమార్‌, స్వేని, లింగారెడ్డి, చైర్ పర్సన్స్ టిటి.రెడ్డి, ఎంఎస్‌.ప్ర‌కాష్‌, అధ్యక్షుడు చంద్ర‌మోహ‌న్‌, సుమన్, విజేందర్ రెడ్డి, కాసం శ్రీనివాస్, కమలాకర్, సెరిపల్లి గణేష్,హేమంత కుమార్, కల్లూరి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, ప్రవీణ్, మధు, భాగ్య లక్ష్మి, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ నాయకులు వి.నవీన్, వెంకటేష్, శ్రీకాంత్, దామోదర్, నర్సింగ్ రావు, సురేష్ రాజు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page