గడిచిన 5 ఏళ్లలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో డివిజ‌న్ అభివృద్ధి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 అధికారుల సమన్వయంతో డివిజ‌న్ అభివృద్ధి
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 5, అద్దం న్యూస్ :   గడిచిన 5 ఏళ్లలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో డివిజ‌న్ అభివృద్ధి చెందింద‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని అన్నారు. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ అధికారిక ప‌ద‌వీ కాలం గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి లోని అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని గురువారం జవహ‌ర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్‌లో కార్పొరేటర్ ఎ.పావని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎ.పావని మాట్లాడుతూ… గడిచిన 5 ఏళ్లుగా ముషీరాబాద్ నియోజకవర్గంలోనే గాంధీనగర్ డివిజన్ అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలిచిందని, అందుకు జిహెచ్ఎంసితో పాటు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో తమకు సహకరించి చేశార‌న్నారు. అధికారుల‌ కృషికి 5 ఏళ్ల లో జరిగిన అభివృద్ధే నిదర్శనం అన్నారు. గడిచిన నిర్ణీత కాలం తరువాత రాబోయే రోజుల్లో తమపై మరింత బాధ్యతలు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా మారిన జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని నూతన అధికారులు, సిబ్బంది తమకు సహకరించి గాంధీనగర్ డివిజన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

    గత 5 ఏళ్లలో అధికారులను, సిబ్బందిని చేసిన ఒత్తిడిని అన్యధా భావించకుండా ప్రజా సేవకు సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ అధికారులకు, సిబ్బందికి కార్పొరేటర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సర్కిల్–40, కవాడిగూడ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆర్.పుష్పలత, శానిటేష‌న్ డిఈ భార్గవ్, ఏఈ మల్లికార్జున్, ఇంజనీరింగ్ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణ మోహన్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్లు శంకర్, మల్లేష్, యుబిడి సూపర్వైజర్ వంశీ, ఎలక్ట్రికల్ ఏడిఈ శ్రీనివాస్, ఏఈ లు, సంతోష్, గోపాల కృష్ణ, అనిల్ కుమార్, రాంకి ఇన్చార్జి సాయి, ఎంటమోలజీ సూపర్‌వైజ‌ర్‌ రమేష్, స్ట్రీట్ లైట్స్ సిబ్బంది బాలు నాయక్, రాజు, డివిజన్ జిహెచ్ఎంసి జవాన్లు, ఏస్ఎఫ్ఏ లు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page