ఈ నెల 30 న రైతు భరోసా పంపిణీ సదస్సు

ఈ నెల 30 న రైతు భరోసా పంపిణీ సదస్సు
– రైతులు, రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స‌మావేశంలో పాల్గొన‌నున్న సీఎం

హైద‌రాబాద్ బ్యూరో, జూన్ 29, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సు కార్య‌క్ర‌మం ఈ నెల 30వ తేదీన‌ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచనల మేరకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సోమ‌వారం అధికారులను ఆదేశించారు. 30 వ తేదీ ( రేపు ) సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page