కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ కార్యాలయంలో దీపావళి వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 21, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కార్యాలయంలో ఘనంగా దీపావళి పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ దంపతులు పూజలు చేసి, అనంతరం కార్యకర్తలతో కలిసి బాణాసంచాలను కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… .దీపాల వెలుగు ప్రజల జీవితాల్లోని చీకట్లను పారద్రోలి సుఖసంతోషాలు వెలుగులు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply