హిదాయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు
మహ్మద్ షాహిద్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం
హైదరాబాద్, జూలై 2, ( అద్దం న్యూస్ ) : డాక్టర్స్ డే సందర్భంగా హిదాయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ షాహిద్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం జరిగింది. భోలక్‌పూర్ ప్రాథమిక వైద్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్.సంజు సుధా, ముషీరాబాద్ ప్రాథమిక వైద్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్.మనోజ్‌రెడ్డిలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హిదాయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ… నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతన్న వైద్య వృత్తి చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మున్నా ఖాన్, జాఫర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.













Leave a Reply