Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాల‌ నిజమైన విజేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. – గాంధీన‌గ‌ర్...

సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాల‌ నిజమైన విజేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :  సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాల‌ నిజమైన విజేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. సోమ‌వారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఆంధ్రాకేఫ్ చౌర‌స్తా వ‌ద్ద‌, అరుంధ‌తిన‌గ‌ర్‌, నేతాజిన‌గ‌ర్, ఎల్ఐసి బ్రిడ్జి వ‌ద్ద త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగిన అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మాల‌కు కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు, చిత్ర ప‌టాల‌కు పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి, దళితులు, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా అంబేద్క‌ర్ కృషి చేశార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్‌, డివిజన్ బీజేపీ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, దళిత మోర్చ అధ్యక్షుడు సత్యేంధర్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, పి.నర్సింగ్ రావు, రాజు, ఎం.ఉమేష్, వాణి శాస్త్రి, సత్తి రెడ్డి, మహమూద్, మదన్మోహన్, సురేష్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్, నర్సింహ, సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, శివ కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంధ్యా రాణి, మంగమ్మ, స్వప్న, పూర్ణ, సంయుక్త రాణి, చిర్ర యాదగిరి, సురేష్ హనుమంతు, డి.కుమార్, సుక్క యాదగిరి, బీజేపీ, ఎంఆర్‌పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page