ముషీరాబాద్, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్‌లోని వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద శుక్రవారం వినాయకుడి లడ్డూ వేలం పాట జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా లడ్డు వేలం పాట జరిగింది. ఎంతో ఉత్సాహభరితంగా జరిగిన ఈ వేలం పాటలో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ వేలం పాటలో ఎం.శ్రీనివాస్, ఎం.సంతోష్ లు మొదటి లడ్డూను లక్షా 45 వేల 500 రూపాయలకు దక్కించుకున్నారు. అలాగే ఎ.రాజు, శివ ఇద్దరు రెండవ లడ్డూను 51 వేల రూపాయలను దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకోవడం చాలా సంతోషంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అసోసియేషన్ నిర్వాహకులు మాచన్‌పల్లి కుషాల్ గౌడ్, కమిటీ సభ్యులు సంతోష్, కౌస్తుభ, సాయి, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు. ![]()

