...

పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

 

హైదరాబాద్, ఏప్రిల్ 4 అద్దం న్యూస్ :  హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు – 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్‌న‌గ‌ర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు ఆర్‌సి పురం, ఫాదర్ స్కూల్, ఓల్డ్ ముంబయి రోడ్డు.. ఈ రెండు చోట్ల భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఈ రోజు రాత్రి 11 గంటల వరకు జరుగుతాయి. కాబట్టి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు :

1. ఓ అండ్ ఎం డివిజన్ – 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా).
2. ఓ అండ్ ఎం డివిజన్ – 8 : హఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.
3. ఓ అండ్ ఎం డివిజన్ – 9 : కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్.
4. ఓ అండ్ ఎం డివిజన్ – 15 : ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్.
5. ఓ అండ్ ఎం డివిజన్ – 24 : బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం.

కాబట్టి పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని అధికారులు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.