...

ఒక బృందావనం” కాన్సెప్ట్‌ అలరిస్తుందా?

ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా అరుదుగా ఉంటున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ బ్యూటిఫుల్‌ అండ్‌ హార్ట్‌టచ్చింగ్‌ సాంగ్‌ ఒకటి ‘ఒక బృందావనం’ నుంచి విడుదలైంది. పసి పసి తనమే…ఎలా.. పరుగులు తీసే ఏరులా అని కొనసాగే ఈ పాటకు ప్రముఖ గీత రచయిత ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ చందబ్రోస్‌ సాహిత్యాన్ని అందించారు.

చిన్మయ శ్రీపాద ఆలపించిన ఈ పాటకు సన్ని అండ్‌ సాకేత్‌ స్వరాలను అందించారు. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంలో నటించారు! బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. తాజాగా విడుదల చేసిన ఈ పాట అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఎంతో హాయిగా కొనసాగే ఈ పాట థియేటర్‌లో ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతినిస్తుంది.

ఈ చిత్రంలో వినోదంతో పాటు మంచి అర్థవంతమైన సందేశాన్ని కూడా ఈ చిత్రంలో జోడించాం. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న మా చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనేట్రైలర్‌ను తీసుకవస్తాం. తప్పకుండా కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.