హైదరాబాద్, నవంబర్ 18, అద్దం న్యూస్ : జలమండలిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వాడకం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందన్నారు. యువతను సరైన మార్గంలో పెట్టడమే లక్ష్యంగా నశా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు.. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, సీజీఎంలు, జీఎంలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply