Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsతెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ఈ నెల 12వ తేదీన ద‌స‌రా మిలాప్

తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ఈ నెల 12వ తేదీన ద‌స‌రా మిలాప్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అక్టోబ‌ర్ 8, అద్దం న్యూస్ : 

తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ఈ నెల 12వ తేద ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఎస్ఆర్‌టి క‌మ్యూనిటీహాల్‌లో ద‌స‌రా మిలాప్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐక్య వేదిక నాయ‌కులు తెలిపారు. ఈ ద‌సరా మిలాప్ కార్య‌క్ర‌మ స‌న్నాహ‌క‌ స‌మావేశం గురువారం ఎస్ఆర్‌టి క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగింది. తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక మీడియా క‌న్వీన‌ర్ గ‌జ్జ‌ల సూర్య‌నారాయ‌ణ‌, ద‌స‌రా మిలాప్ క‌న్వీన‌ర్లు ఆర్‌.వివేక్, గండి క్రిష్ణ‌, కేశ‌వ‌పురం స్వామి, అరుణ్‌, గ‌డ్డం న‌వీన్‌, జి.వెంక‌టేష్‌, ఎం.భాస్క‌ర్‌, రామ‌స్వామి, జివై.గిరి, ప‌రిమల్‌కుమార్‌, న‌ర్సింగ్‌రావు, స‌దానంద్, హ‌రీష్‌, ఎర్రోళ్ల స‌తీష్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… ఈ ద‌స‌రా మిలాప్ కార్య‌క్ర‌మానికి న‌గ‌రంతో పాటు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ద‌ళిత సంఘాల‌ నాయ‌కులు, మ‌హిళా ప్ర‌తినిధులు, ద‌ళిత యువ‌కులు పెద్ద ఎత్తున హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page