సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి ఆధ్వర్యంలో ఈద్ మిలాప్
హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : రంజాన్ పండుగ తర్వాత నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు, రేడియంట్ హై స్కూల్ కరస్పాంటెండెంట్ సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మతసామరస్యానికి ప్రతీకగా ఈద్ మిలాప్ ను సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జైసింహా, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండ శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పులిగిల్ల శ్రీధర్‌చారి, కృపానంద్, రెబ్బ రామారావు, మోయిన్, జావీద్ ఖాన్, ఖదీర్, మున్నా, మునావర్ చాంద్, ఇమ్రాన్ ఖాన్, అబ్రార్ హుస్సేన్ ఆజాద్, బిక్షపతి యాదవ్, కొండా సహదేవ్, గంటల రాజు, జాఫర్, ఎయిర్‌టెల్ రాజు, బూడిది లక్ష్మణ్‌గౌడ్, రంగు శ్రీనివాస్, దీన్‌దయాల్, చింటు, సమీర్ హుస్సేన్, సల్మాన్, షకీల్, ఇమ్రాన్ బొగ్దాది, రాజు గౌడ్, సదా, జహీరుద్దీన్ సమర్, పర్వేజ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోయినుద్దీన్, బిజెపి నాయకుడు విశ్వనాథ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.![]()














Leave a Reply