నల్లకుంటలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలి

నల్లకుంటలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలి
– నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్‌

అంబ‌ర్‌పేట‌, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ :  నల్లకుంటలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్రతినిథి బృందం డిమాండ్ చేసింది. ఈ మేర‌కు జిహెచ్‌ఎంసి కమీషనర్‌ కార్యాలయం ప్రజావాణిలో చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్‌కు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉమాదేవి ల‌ను నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్ర‌తినిధి బృందం సోమ‌వారం క‌లిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్రధాన కార్యదర్శి మోహన్‌ నాయుడు, నాయకులు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, వీరయ్య తదితరులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్‌లో పాత రామలయం దగ్గర ఇటీవల జి+2 పర్మిషన్‌ తీసుకొని జి+4 నిర్మాణం చేప‌ట్టార‌న్నారు. ప్ర‌స్తుతం అదనంగా చుట్టు ప్రక్కల వారికి కనీస సమాచారం లేకుండా, లేలాంటి అనుమతులు లేకుండా 4 వ అంతస్తు పై 9 మీటర్ల ఎత్తులో, మూడు సెల్‌ టవర్స్‌ నిర్మిస్తున్నారన్నారు.

నగరంలో కాలుష్యం పెరుగుతూ అనేక రోగాలకు గురి అవుతున్న పరిస్థితులలో, ఇప్పుడు ఈ సెల్ టవర్ రేడియేషన్‌తో మరిన్ని రోగాలను వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. కావున దయచేసి అక్రమణ కటడ్డాలను తొలగించండి. చుట్టు ఇండ్లకు కాలనీలో పార్కింగ్‌, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. అదే ప్రాంతంలో పాతరామలయం ఎదురుగా ఇ.నెం. 2-1-260లో 108 గజాలలో ఇటీవల జి+2 పర్మిషన్‌ తీసుకొని జి+4 నిర్మాణం చేప‌ట్టార‌న్నారు. ఇంటి నిర్మాణం పై చుట్టు ప్రక్కల వారు అనేక మంది అభ్యంతరాలు తెలిపిన, ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.  8 నెలల క్రితం జిహెచ్‌ఎంసి అధికారులు వచ్చి అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఆపివేశార‌న్నారు. ఇందుకు స్పందించిన ఆక్రమణ కటడ్డాల పై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు హామి ఇచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page