హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నెల సివిల్ రైట్ డే నిర్వహించేలా చూడండి
– ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్
హైదరాబాద్, మే 13, అద్దం న్యూస్ : హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నెల సివిల్ రైట్ డే నిర్వహించేలా చూడాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ కోరారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ వినతి పత్రాన్ని అందచేవారు. ఈ సందర్భంగా సిరిగిరి శ్యామ్ మాట్లాడుతూ… ఎవరైనా పౌర హక్కులకు భంగం కలిగించిన కుల వివక్షత చూపించిన తక్షణమైన రక్షణ కోసం ఫిర్యాదు చేసే చట్టాలపై అవగాహన కల్పించే విధంగా చూడాలన్నారు. జాతి, మతం సంబంధం లేకుండా చట్ట ప్రకారం సమాన సామాజిక అవకాశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజన పథకాలపై అవగాహన కల్పించే విధంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ప్రతినెల సివిల్ రైట్ డే ని నిర్వహించేలా చూడాలని వినతి పత్రం అందచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply