Saturday, September 19, 2026
No menu items!
HomeEducationప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో గ్రంథాల‌యాల ఏర్పాటు – విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో గ్రంథాల‌యాల ఏర్పాటు – విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా

📰 Generate e-Paper Clip

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో గ్రంథాల‌యాల ఏర్పాటు
– విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా

హైదరాబాద్, మే 15, ( అద్దం న్యూస్ ) :  ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో గ్రంథాల‌యాల ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయంలో విద్యా వారోత్సవాల కార్యక్రమం శుక్ర‌వారం హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం బాగ్ అంబ‌ర్‌పేట డివిజ‌న్ ఇంధ్ర‌ప్ర‌స్థ‌ కాల‌నీలోని గ్రంథాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ పాఠశాల విద్యార్థుల్లో పుస్తక పఠన ఆశక్తిని పెంపొందించటం కోసం 1138 పాఠశాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. భారత దేశ చరిత్రలో పాఠశాల స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయటం ఒక చారిత్రాత్మక నిర్ణయమ‌న్నారు. విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, సమాజం పట్ల అవగాహన పెంపొందింపచేయటంలో గ్రంథాలయాల తోడ్పాటు అత్యవసరమ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్ట‌ర్‌.రియాజ్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్, హైదరాబాద్ విద్యాశాఖ అధికారి రోహిణి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ గ్రంధాలయ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, లైబ్ర‌రీస్ డైరెక్ట‌ర్ శ్రీహ‌రి, డిప్యూటీ డైరెక్ట‌ర్ హ‌రిశంక‌ర్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ న‌ర‌సింహులు, హైదరాబాద్‌ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు కె.కేశ‌వ‌రావు, గ్రంథాల‌య ఉద్యోగులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page