వర్తమాన రాజకీయాల్లో ఓంకార్ జీవిత త్యాగ చరిత్ర ప్రతి కమ్యూనిస్టు పార్టీ ఆచరించాలి – ఎంసిపిఐ (యు) జనరల్ బాడీ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పిలుపు

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :    వర్తమాన రాజకీయాల్లో ఓంకార్ జీవిత త్యాగ చరిత్ర ప్రతి కమ్యూనిస్టు పార్టీ ఆచరించాలని ఎంసిపిఐ (యు) జనరల్ బాడీ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి ఓంకార్ భ‌వ‌న్ బిఎన్‌హాల్‌లో ఎం సిపిఐ (యు ) జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ప‌స్కుల సైద‌క్క అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. శాసనసభ సభ్యులుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా, కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత వాదిగా, సామాజిక ఉద్యమ పితామహుడిగా భారత దేశంలో వారు నిర్మించిన ఎంసిపిఐ (యు) పార్టీ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఆదివాసి ప్రజలకు స్వయం పాలన అధికారం కావాలి అని భద్రాచలం రాజధానిగా గోదావరి లోయ పరివాహక అటవీ ప్రాంతం ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం ఆదివాసి ప్రాంతాన్ని స్వయం పాలనాదికారం కల్పించాలని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 1986-1987 ప్రాంతంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నెలల తరబడి చేసిన పోరాటాలు ఆదివాసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు చారిత్రాత్మకం అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు అన్ని ఏకం అయ్యేంతవరకు కనీస అంగీకృత కార్యక్రమాల‌ను రూపొందించుకొని కమ్యూనిస్టు వామపక్ష శక్తులు ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని చేసిన కృషితో 1988-89 లో సిపిఐ, ఎంసిపిఐ, లోక్ దళ్ గౌతు లచ్చన్న, ఆర్‌పిఐ ఈశ్వర్ బాయి పార్టీలు కలిసి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ( ఎల్‌డిఎఫ్‌) ను ఏర్పాటు చేసారన్నారు.

ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ… నేడు ప్రపంచం అనేక ఉద్రిక్తతల మధ్య‌ యుద్ధ వాతావరణంలో ఉందని.. దీనికి ప్రధాన కారణం సామ్రాజ్యవాదం, కార్పొరేట్‌, పెట్టుబడి దారీ ఆర్థిక విధానాలు అని అన్నారు. ఎంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ… వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోను విరమణ తరువాత సాగిన మలిదశ భూ పోరాటంలో లక్షలాది ఎకరాల భూములను ప్రజల పరం చేసిన అసెంబ్లీ టైగర్, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభలు 2025 మే 12 నుంచి ప్రారంభం అయ్యాయ‌ని, అవి 2026 మే 12 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, వస్కుల మట్టయ్య, కుంభం సుకన్య, పెద్దారపు రమేష్, మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేల్లి కొమురయ్య, నర్రా ప్రతాప్, కర్రోల శ్రీనివాస్, ఎం.జబ్బర్ నాయక్, తుడుం అనిల్ కుమార్, పోతుగంటి కాశీ, తాండ్ర కళావతి, మాస్ సావిత్రి, పల్లె మురళి, వివిధ జిల్లాల కమిటీ సభ్యులు, డివిజన్ స్థాయి సభ్యులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page