అగ్ని ప్రమాదాల నియంత్రణ, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
– గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : అగ్ని ప్రమాదాల నియంత్రణ, అవగాహన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. నేడు ( సోమవారం ) తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి సమక్షంలో తార్నాకలోని డిప్యూటీ మేయర్ నివాసంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మోతే శ్రీలత మాట్లాడుతూ… అగ్నిమాపక శాఖ పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. ప్రజలు అగ్నిమాపక నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చైతన్యవంతులు కావాలన్నారు. అలాగే, అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెమినార్లు, మాక్ డ్రిల్స్, ప్రజలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ రామకృష్ణారెడ్డి, ఎల్ఎఫ్.గోవింద్, ఫైర్ మాన్ రాజారెడ్డి, విజయభాస్కర్, రమేష్, ఉపేందర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply