విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవా గుణం అలవర్చుకోవాలి
హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ : విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవా గుణం అలవర్చుకోవాలి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ బుస రమేష్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలలో విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ బుస రమేష్ మాట్లాడుతూ… విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. అప్స లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాధవి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వివిధ దాతల ద్వారా నోట్స్ పుస్తకాలు కాకుండా అనాధలకు, ముసలి వారికి వివిధ దాతల ద్వారా సహాయం చేయడం సంతోషం అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ సామజిక కార్యకర్త, సీనియర్ కో-ఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ… విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు. విద్యార్థులకు విద్యార్థి లకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్ కుమార్ గౌడ్, అప్స సామాజిక కార్యకర్తలు శ్రావణి, లావణ్య, పిజి కాలేజ్ ఆఫ్ సోషల్ వర్కర్, విద్యార్థులు గని, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply