12 గంట‌ల పాటు ఎస్‌పిబి, యేసు దాసుల పాట‌ల‌ను పాడిన కాస‌ర్ల సురేష్‌ – వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరు న‌మోదు

12 గంట‌ల పాటు ఎస్‌పిబి, యేసు దాసుల పాట‌ల‌ను పాడిన కాస‌ర్ల సురేష్‌ 

వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరు న‌మోదు



హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :   వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చార్వి ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, గాయ‌కుడు కాస‌ర్ల సురేష్ పేరు న‌మోదు అయింది. ఎస్‌పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, కెజె.యేసుదాసు లు పాడిన పాట‌ల‌ను సురేష్ 12 గంట‌ల పాటు నిర్విరామంగా పాడినందుకుగాను ఆయ‌న‌కు వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చొటు ద‌క్కింది. ఈ నెల 24వ తేదీన హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల సిటీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ హాల్లో చార్వి ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన 14వ సాంస్కృతిక కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌రిగిన తెలుగు, హింధీ సినీ చిత్ర గీతా విభావ‌రిలో చార్వీ సంస్థ ఫౌండ‌ర్ కాస‌ర్ల సురేష్ పాటల‌ను సురేష్‌ పాడారు. ఈ కార్య‌క్ర‌మానికి వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆలిండియా చీఫ్ కో-ఆర్డినేట‌ర్ న‌రేంద‌ర్ గౌడ్ హాజ‌రై కాస‌ర్ల సురేష్ పాడిన పాటల‌ను ప‌రిశీలించి వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను న‌మోదు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మూవీ ఆర్టిస్ట్ రామ్‌ మానిక్‌, మూవీ ఆర్టిస్ట్ శ్రీనివాసులు, వంశీ రామ‌రాజు, వినోద్ గౌడ్, బైరి శ్రీనివాస్‌, గాయ‌నీ, గాయ‌కులు చైత‌న్య‌, భార్గ‌వి, ల‌క్ష్మీర‌త్నం, ఇందిర‌, రాగ‌రేఖ‌, అరుణ‌, శ్రీరాణి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గాయ‌నీల‌తో క‌లిసి సురేష్ పాట‌లు పాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… త‌న పేరును వండ‌ర్ బుక్ ఆప్ రికార్డ్స్‌లో న‌మోదు చేసినందుకు చాలా గ‌ర్వ‌కారంగా ఉంద‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page