ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 3, అద్దం న్యూస్ : ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ సిద్దంశెట్టి, జనప్రియ అపార్ట్‌మెంట్లల్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద మంజూరైన రూ.20 లక్షల నిధులతో ఓపెన్ జిమ్‌లను శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్ ఏ.పావని లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు ద్వారా పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు మంచి ఉపయోగకరమని, ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం, శరీర ధారుడ్యం పెరగడం ద్వారా మానసిక ఆహ్లాదం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, నాయకులు వైద్యనాథ్, శ్రీకాంత్, బాల కృష్ణ, సత్తి రెడ్డి, మహమూద్, నవీన్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, సిద్ధం శెట్టి అపార్ట్‌మెంట్స్ వాసులు జితేందర్ రెడ్డి, జయ కృష్ణ, ప్రసన్న, లక్ష్మీ , జనప్రియ అపార్ట్‌మెంట్స్ వాసులు స్వామి దాస్, మల్లేష్, సుధ, మితేష్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply