కరెన్సీ పై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని పార్లమెంట్‌లో కొట్లాడుతా
– నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.మల్లు రవి

జంతర్‌మంతర్, ఆగస్టు 05, అద్దం న్యూస్ : కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని పార్లమెంట్‌లో కొట్లాడుతానని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.మల్లు రవి అన్నారు. కరెన్సీ పై ఆర్‌బిఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ దేశవ్యాప్త లక్ష పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ఈ నెల జులై 23 న ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై మంగళవారం ఢిల్లీ జంతర్ మంతర్‌లో మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాకు మద్దతుగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.మల్లు రవి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాడు అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్‌బిఐ లేదని.. అయన ఫొటోని కరెన్సీ నోట్లపై ముంద్రించాలని నా తోటి పార్లమెంట్ సభ్యులను కూడగట్టి పార్లమెంట్‌లో పోరాడుతానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కి పోస్ట్ కార్డ్ వ్రాయడం జరిగిందని తెలిపారు. కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ… 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్,సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1935 ఏప్రిల్ 1 న రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పడిందన్నారు. జాతీయ జండ రూపాకల్పన కమిటీ ఏర్పడ్డ రోజు జాతీయ జెండాలో అశోక చక్రం పెట్టిన రోజు జూన్ 23 నుండి 2026 జనవరి 26 వరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లక్ష మందితో పోస్ట్ కార్డ్స్ పంపిస్తామని ఈ అంశం పై పార్లమెంట్‌లో ప్రస్థావించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బిఐ జాతీయ అధ్యక్షుడు జాన్, ఓబిసి విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు కిరణ్, కరెన్సీ అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, చంద్రహాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply