అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ప్రముఖ నిర్మాత, ఏవీఎం స్టూడియోస్ యజమాని AVM శరవణన్ (AVM Saravanan) (86) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 1945లో ఆయన తండ్రి ఏ.వి.మెయ్యప్పన్ స్థాపించిన ప్రఖ్యాత ‘ఏవీఎం ప్రొడక్షన్స్’ పగ్గాలు చేపట్టి, దాన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత శరవణన్‌ది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించిన ఏవీఎం శరవణన్, తన నిర్మాణ విలువలతో సినీ రంగానికి మార్గదర్శకుడిగా నిలిచారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మెరుపుకలలు’, ‘లీడర్’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. తమిళంలో రజనీకాంత్‌తో ‘శివాజీ: ది బాస్’, ‘జమిని’ వంటి బ్లాక్‌బస్టర్‌లను నిర్మించి, అగ్ర నటులందరితోనూ పనిచేశారు.
అజాతశత్రువుగా, నిబద్ధత కలిగిన నిర్మాతగా పేరుగాంచిన శరవణన్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పార్థివ దేహాన్ని ఏవీఎం స్టూడియోస్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఆయన వారసత్వాన్ని కుమారుడు ఎమ్.ఎస్.గుహన్, మనవరాలు అరుణ గుహన్ కొనసాగిస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply