...

Yadagirigutta Temple : సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం పాల‌క‌ మండ‌లి స‌భ్యులు

Yadagirigutta Temple : సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం పాల‌క‌ మండ‌లి స‌భ్యులు

యాదగిరిగుట్ట, జూలై 8, ( అద్దం న్యూస్ ) :   యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని బుధ‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఈ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్ ఎం.సత్యనారాయణ రెడ్డి, బోర్డు సభ్యులైన ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయ రాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం.రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై నూతన పాలక మండలికి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.