Singer S.Janaki : తెలుగు సినిమా రంగంలో విషాదం
సినీ గాయని ఎస్.జానకి మృతి
సినిమా, జూలై 11, ( అద్దం న్యూస్ ) : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ సౌతిండియా, ప్రముఖ గాయని… ఎస్.జానకి అసలు పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చాలా కాలం పాటు ఆమె కరీంనగర్ సిరిసిల్లలోనే పెరిగారు. ఆవిడ 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం పొందారు. వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు అందుకున్నారు. 12 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడిన జానకి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్‌ప్రసాద్ 1990లలో మరణించారు. ఆవిడకు మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడు ఉన్నారు. ఈయన భరతనాట్యంలో ప్రవీణుడు. తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు అనే చిత్రాల్లో నటించారు. మురళీకృష్ణ, ఈ ఏడాది జనవరి 22న మరణించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో తన మనవడు చనిపోవడంతో జానకమ్మ తీవ్ర మానసిక ఆవేదనకు లోనయ్యారు.
1957లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారు. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువాళ్లకు దగ్గరయ్యారు. ఈ చిత్రంలో పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా సెలయేరులా మొదలైన ఆమె గానం… ఎన్నో మలుపులు తిరుగుతూ ఓ మహా సాగరంలా మారి తెలుగువాళ్లను మంత్రముగ్దులను చేశాయి. ఉద్దండులైన సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వర విద్వాన్ పైడిస్వామి దగ్గర సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట, తన మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ప్రారంభించారు. ఈ గానకోకిల గాయని మాత్రమే కాదు… పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలుగా కూడా వ్యవహరించారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించిన జానకి :
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి జానకమ్మ గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.
పలు బాషల్లో పాటలు పాడిన జానకి :
హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి…. ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. పాటల్లో మిమిక్రి మిక్స్ చేసి సంగీతప్రపంచాన్ని మెప్పించారు. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరంతో పాటు చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాటలు పాడారు.












Leave a Reply