అమెరికాలో అగ్ని ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి
వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణ విద్యార్థిని మృతి చెందింది. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం గుంటూరుపల్లికి చెందిన ఉడుమల సహజ రెడ్డి ( 24 ) అనే యువతి ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళింది. అక్కడే బర్మింగ్‌హామ్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సహజ రెడ్డి నివసిస్తుంది. ఇదిలా ఉండగా నిన్న ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సహజారెడ్డి మృతి చెందింది.














Leave a Reply